Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్విద్యుద్ఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి

విద్యుద్ఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి

- Advertisement -

– జెండా ఏర్పాట్లు చేస్తుండగా వైర్లకు తగిలి..
– సిద్దిపేట జిల్లా వేచరేణి గ్రామంలో ఘటన
నవతెలంగాణ-చేర్యాల

జాతీయ జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జెండా పైపు విద్యుత్‌ వైర్లకు తగిలి విద్యుద్ఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ. మోహిన్‌ పాషా(32) అదే గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. నేడు(శుక్రవారం) జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కోసం విధినిర్వహణలో భాగంగా గురువారం జెండా పైపు (ఇనుము)ను శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జెండా పైపు 11 కేవీ విద్యుత్‌ వైర్లకు తాకడంతో మోహిన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad