నవతెలంగాణ-హైదరాబాద్ : స్వతంత్రంగా రూపొందుతున్న చిత్రం “సంజీవ్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత-దర్శకులు శ్రీ మధుర శ్రీధర్, తెలుగు చలన చత్ర దర్శకుడు శ్రీ సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ చిత్రానికి అనిల్ నక్క దర్శకత్వం వహిస్తున్నారు. రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా ఆయన ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కె జోసెఫ్, నటులు వీర మనోహర్, అచ్యుత్, హరీష్ పాలకుర్తి, శివ శంకర్ చింతకింది తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర కథ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండేలా రూపొందించబడిందని యూనిట్ సభ్యులు వెల్లడించారు.
త్వరలో టీజర్, ట్రైలర్ ఇంకా పాటలను మధుర ఆడియో ద్వారా విడుదల చేయనున్నామని దర్శకుడు అనిల్ నక్క తెలిపారు
“సంజీవ్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES