Tuesday, March 17, 2026
E-PAPER
Homeఆటలుసంజూ శాంసన్ కేర‌ళకు గ‌ర్వ‌కార‌ణం: సీఎం పినరయి విజయన్‌

సంజూ శాంసన్ కేర‌ళకు గ‌ర్వ‌కార‌ణం: సీఎం పినరయి విజయన్‌

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజూ శాంసన్ కేర‌ళ సీఎం పినరయి విజయన్‌ను మ‌ర్వాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంగ‌ళ‌వారం కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో సీఎం అధికార నివాసానికి సంజును ఆహ్వానించి పుష్ప‌గుచ్చం ఇచ్చి అభినందించారు. మోగా టోర్నీలో కీల‌క స‌మ‌యంలో అద్భుత ఆట‌తీరుతో టీమిండియాకు క‌ప్ అందించ‌డంలో ముందున్నందుకు సంతోషంగా ఉంద‌ని, కేర‌ళకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని కొనియాడారు. త‌న ఆట‌తో కేర‌ళ క్రికెట్ ఆట‌గాళ్ల‌కు ఆదర్శ‌నీయంగా నిలిచార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న‌తో భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజయాలు అందించాల‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సంజు.. వెస్టిండీస్‌పై నాకౌట్ మ్యాచ్‌లో 89, సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 89, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మరో 89 పరుగులు చేశాడు. మార్చి 8న న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది టీమిండియా. ఈ విజయంతో భారత్ సొంతగడ్డపై T20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా, 2024లో విజయం సాధించిన తర్వాత వరుసగా టైటిల్స్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా మరియు మూడుసార్లు (2007, 2024, మరియు 2026) ట్రోఫీని అందుకున్న మొదటి జట్టుగా భార‌త్ నిలిచింది.

సంజూ శాంసన్ టోర్నమెంట్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో 80.25 సగటుతో, 199.37 స్ట్రైక్ రేట్‌తో 27 ఫోర్లు, 24 సిక్స్‌లతో 321 పరుగులు చేశాడు. ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -