నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ అపోలో వొకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం ముందస్తుగా సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థిను లు ముగ్గుల పోటిలలో చాలా ఉత్సహంగా పాల్గొన్నారు. తీరొక్క రంగులతో అందమైన ముగ్గులని వేసి వారి ప్రతిభని చాటారు. ఈ పోటీలలో మొదటి విజేతకి రూ .1000, రెండవ విజేతకి రూ 500 నగదు బహుమతి అందజేశారు.
పోటిలలో పాల్గొన్న అందరికి ప్రోత్సహక బహుమతులుగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ గణేష్ వేముల మాట్లాడుతు పోటీలలో గెలుపు ఓటములు సహజం ఎవరు బాదపడకుండా తదుపరి పోటీలలో మీ ప్రతిభ చూపి విజేత కావడానికి ప్రయత్నాం చేయాలన్నారు. అలాగే ప్రతి పండుగ ప్రాముఖ్యత తేలుసుకుంటూ వచ్చే తరాలకి తేలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమత అద్యాపకబృందం మరియు అరుణ విద్యార్థులు తధితరులు పాల్గొన్నారు.



