- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు, గాలి పటాలు ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు పాఠశాల ఆవరణలో అందమైన రంగురంగుల ముగ్గులు వేశారు. విద్యార్థులకు సంక్రాంతి ప్రాముఖ్యత గురించి కరస్పాండెంట్ బాలి రవీందర్ వివరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా తయారయ్యి అలరించారు. కార్యక్రమంలో లక్ష్మి, షబానా, సుధాకర్ గౌడ్, రాజేష్, రాజశ్రీ, సంజీవ్, అనూష, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



