- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్ : జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ)ఇందూర్ ఆద్వర్యంలో బుధవారం నిజామాబాదు నగరంలోని ఇంద్రాపూర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.. అనంతరం కాలనీకి చెందిన పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ కాలె,తిరునగరి తేజస్వి, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్,ప్రోగ్రామ్ చైర్మెన్ కోడూరు శ్రీనివాస్,జేఏసి అలుమ్ని క్లబ్ రీజియన్ చైర్మెన్ జిల్కర్ లావణ్య, పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్, తిరునగరి శ్రీహరి,జేసీఐ ప్రతినిధులు నిపుణ్, సునీత,వెన్నెల,మృణాళిని,అక్షిత,బి.నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



