Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయంనారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మంగళవారం ఉదయం నుండే అశేష జనంతో పల్లె మొత్తం కిక్కిరిసింది. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఆయన కుటుంబీకులంతా, నందమూరి కుటుంబీకులు కలిసి ఆనందంగా తిలకించారు. గ్రామ ఆటల పోటీలలో నారా దేవాన్ష్‌ అత్యుత్సాహంగా పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌లు అందజేశారు. ప్రజల వద్ద సమస్యలను సిఎం చంద్రబాబు తెలుసుకొని అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్‌ దివాకర్‌ రెడ్డి, శాప్‌ చైర్మన్‌ రవి నాయుడు, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వరన్‌, ఎస్‌ పి సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -