– పుష్కరఘాట్‌ను ప్రారంభించనున్న సీఎం : ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కొండా సురేఖ
– 26 వరకు పుష్కర స్నానాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా కాళేశ్వరంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. త్రివేణి సంగమం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి సరస్వతి ఘాట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వర త్రివేణీ సంగమంలో ఆయన పుణ్యస్నానం చేస్తారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పుష్కర ఏర్పాట్లపై ఆమె నిత్యం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలు గురువారం ఉదయం 5 గంటల 44 నిముషాలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానాలను ఆరంభిస్తారు. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుండి 7.35 గంటల వరకు సరస్వతి ఘాట్‌లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. పుష్కర్ స్నానం ఆచరించేవారికి తాత్కాలిక టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రివేళ కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది. బుధవారం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ కాళేశ్వరంలో క్షేత్రస్థాయి పనుల్ని పరిశీలించారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆమె తెలిపారు. త్రివేణి సంగమంలో తొలిసారిగా కాశీ పండితులు నిర్వహించే నదీ హారతిలో సీఎం పాల్గొంటారని చెప్పారు. అధికారులు, సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
నేటినుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES