- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఏడాదే బీటెక్ పూర్తి చేసిన ఆ యువతి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందారు. కానీ, ప్రయివేటు కొలువును కాదని.. సర్పంచిగా కొలువుదీరేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. 21 ఏళ్ల యువతి చొరవకు గ్రామస్థులు సైతం మద్దతు పలికి గెలిపించుకున్న ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన గ్రామానికి చెందిన బోయపల్లి అనూష బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా బరిలో దిగారు. సీనియర్ నాయకురాలైన(కాంగెస్ మద్దతు) అభ్యర్థిపై.. 182 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు బాగుపడతాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
- Advertisement -



