నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎస్ఐ అనిల్ రెడ్డిని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎస్ఐ అనిల్ రెడ్డిని సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు అవసరమైన సహాయ సహకారాలు గ్రామ పంచాయతీ నుండి తప్పకుండా అందిస్తామని ఈ సందర్భంగా ఎస్ఐకి సర్పంచ్ దంపతులు తెలిపారు. సర్పంచ్ దంపతులను కూడా ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మల్యాల సుభాష్ గౌడ్, తీగల హరీష్, బాలు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసిన సర్పంచ్ దంపతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



