- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి విజయమ్మ, ఎన్నికల్లో గెలిస్తే కోతుల బెడద నుండి విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఆమెను గెలిపించడంతో, ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించి, 113 కోతులను పట్టి అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



