- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన దుండ కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గురువారం గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి మృతుని కుటుంబాన్ని పరమర్షించి అధైర్య పడొద్దని ఓదార్చారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, సన్నబియ్యం బస్తాను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కల దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచంపల్లి కత్తెరసాల, అక్కల రాము,మహేష్ పాల్గొన్నారు.
- Advertisement -



