- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా నిలుస్తూ.. విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తున్న ప్రముఖ తెలుగు దినపత్రిక నవతెలంగాణ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను.. సోమవారం శ్రీరాంపూర్ గ్రామసర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్న గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచురిస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్న నవతెలంగాణ దినపత్రిక అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెద్దివిలాస్, కార్యదర్శి గణేష్ ,కరోబార్ రాజేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



