నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఎన్నికల సందర్బంగా గ్రామంలోని కోతులను పట్టిస్తానని తొలి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కోతులను పట్టే వారి సహాయంతో శనివారం ఆ హామీని నెరవేర్చానని సగర్వంగా గ్రామస్థులకు తెలిపారు. కోతులు పంట పొలాలను, నివాస గృహాలలో ఉండే వస్తువులను నాశనం చేస్తున్నాయని తెలిసి, నా సొంత నిధులతో కోతులను పట్టించి ఈ సమస్యకు పరిష్కారం చూపానని అన్నారు. ఈ సందర్భంగా కోతులు పట్టే వారితో మాట్లాడుతూ మా గ్రామంలో ఒక్క కోతి లేకుండా అన్ని కోతులను సాధ్యమైనంత తొందరలో పట్టేసి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో విడిచిపెట్టాలని కోరారు. తొందరలో మన గ్రామంలో కోతుల సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజనేయులు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,వార్డు సభ్యులు దొంకేన పాండురంగం,జిన్న నర్సింహ,పిన్నం సత్తయ్య హంసమ్మ,పిన్నం పాండు కవిత,తోటకురి పాండు,మాజీ వార్డు సభ్యులు వి పరమేష్,మాజీ కోఅప్షన్ మెంబర్ డి అశోక్, బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు బాబా, మాజీ స్కూల్ చైర్మన్ మహేందర్, మహిపాల్, రాము, అనిల్,జిన్న శ్రీను, కిష్టయ్య, అశోక్,బిచ్చల మహేష్, మల్లేష్, మహేష్, మునీర్,గ్రామస్తులు పాల్గొన్నారు.
తొలి హామీని నెరవేర్చిన సర్పంచ్ వెంకటరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



