- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా సర్పంచ్ గా ఎన్నికైన విశాలాక్షి దంపతులకు మద్నూర్ విలేకరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తమ దంపతులకు సన్మానించినందుకు విశాలాక్షి కుటుంబ సభ్యులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ విలేకరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజా సమస్యలు విలేకరులుగా తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో హనుమాన్లు పండరి నవనీత్ నాగేష్ గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -



