నవతెలంగాణ – సదాశివనగర్ : మండలంలోని పద్మాజివాడి గ్రామ మాజీ సర్పంచ్ మడి పెద్ది కవిత డబ్బులు చెల్లించలేదని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గోకోటి సుబ్బారావు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 2019 డిసెంబర్ 7న ఒక లక్ష 26,000/- ఎస్ ఎఫ్ సి నుండి స్మశాన వాటికకు 2020 ఫిబ్రవరి 26న 2 4000/- 14 ఫైనాన్స్ లో స్మశాన వాటికకు తీసుకున్నారు. మొత్తం రూ. 330000/- రూపాయలు తీసుకున్న డబ్బులు చెల్లించలేదని తెలిపారు. నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా డబ్బులు చెల్లించిన రూ. 33,0000 బాకీ మాత్రం చెల్లించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లవెల్లి, రాజశేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు తీగల నాగాగౌడ్, గుండ్రెడ్డి శ్రావణ్, రంజాన్, కార్యదర్శి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
స్మశాన వాటిక నిర్మాణానికి తీసుకున్న డబ్బులు చెల్లించని సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



