నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిర్నాపల్లి గడిలో సర్వసమాజ్ కమిటీ నిజామాబాద్ ఇందూరు, మన సర్వ సమాజ్ కమిటీలో ఉన్న అన్ని కులాల సంఘాల ప్రతినిధులు పెద్ద కాపులు, పెద్దమనుషులతో సర్వసమాజ కమిటీ ఎండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన, కార్యదర్శి బంటు రాజేశ్వర్, కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్, కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.అందరి ఆమోదంతో జూలై 13 ఆదివారం నాడు ఊర పండుగను నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ పండుగకు శుభ ఆవిర్భావంగా జూలై 8 మంగళవారం నాడు పెద్ద మెయిన్ సంఘాల కూడల్లా కాడా బండారు పోయడం జరుగుతుంది. తర్వాత మన తల్లులా విగ్రహాలా తయారునూ వడ్లధాతీ వద్ద ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు. శనివారం 12 జూలై నాడు సరి ప్రసాదం తయారీ కోరకు సంబంధించిన సామాగ్రినీ రాత్రి 10 తర్వాత అన్నీ కుల సంఘాల ఆధ్వర్యంలో సర్వసమాజ్ కమిటీ వారి నుంచి సిర్నాపల్లి ఘడిలో పంపిణీ చేయడం జరుగుతుందని క్లుప్తంగా వివరించారు.
అన్ని కుల సంఘాలతో సర్వసమాజ్ కమిటీ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES