- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ దాడులకు వేలాది మంది చనిపోతే.. ఆకలికి తట్టుకోలేక వందలాది మంది చనిపోతున్నారు. గాజాలో తీవ్రమైన ఆకలికి తట్టుకోలేక 112 మంది చిన్నారులతో సహా 263 మంది చనిపోయారని ఆదివారం పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గాజాకు వెళ్లే ఆహారాన్ని, నీటిని, మానవతా సహాయాన్ని ఇజ్రాయిల్ మే నెల నుంచే నిషేధించింది. దీంతో గాజాలోని ప్రజలు తిండిలేక అల్లాడుతున్నారు. తాగడానికి నీరులేక డీహ్రేడేషన్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారులు చర్మాన్ని కప్పుకున్న ఎముకలా చూడులా.. అస్థిపంజరాల్లా వుంటున్నారు. అందుకే చిన్నారులు పిట్టలాల రాలిపోతున్నారు.
- Advertisement -