Friday, May 2, 2025
Homeఆటలుశాట్స్‌ వేసవి శిక్షణ శిబిరాలు షురూ

శాట్స్‌ వేసవి శిక్షణ శిబిరాలు షురూ

హైదరాబాద్‌: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు గురువారం ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సహా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని క్రీడా మైదానాల్లో ఉదయం నుంచి సమ్మర్‌ క్యాంప్‌లు ఆరంభం అయ్యాయి. సమ్మర్‌ క్యాంప్‌లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4000 మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని శాట్జ్‌ అధికారులు తెలిపారు. వనపర్తిలో జరిగిన జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేసి, సమ్మర్‌ క్యాంప్‌లను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 6 వరకు సమ్మర్‌ క్యాంప్‌లు కొనసాగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img