రేఖ కళ్యాణి ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
యాస సత్తిరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో అనారోగ్యంతో సత్తిరెడ్డి మృతిచెందగా మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశానుసారం రేఖ కళ్యాణి మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ లు వచ్చి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహంపై పూలమాలలు వేసి సత్తిరెడ్డికి ఘన నివాళి అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. సత్తిరెడ్డి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరచడంలో అహర్నిశలు కృషి చేశారని అన్నారు. సత్తిరెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ మరియు సీతక్క గారు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ తో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
సత్తిరెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES