నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జయంతి, వర్ధంతిలు ఒక చరిత్ర కలిగిన మహనీయులకు చేస్తారన్నారు. అందులో భాగంగానే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే భారతదేశ చరిత్రలో ఒక గొప్ప చరిత్ర కాబట్టే ఇక్కడ ఆ తల్లి జయంతిని జరుపుతున్నట్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే సేవలను గుర్తించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటినుండి మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవం నిర్వహించాలని గెజిట్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మండల ఏవైఎస్ గౌరవ అధ్యక్షులు పాలెపు నర్సయ్య, సలహాదారు తెడ్డు రమేష్, కార్యవర్గ సభ్యులు లెక్చరర్ సాయన్న, మేకల శ్రీకాంత్, గుర్రం నరేష్, వినయ్, గుర్రం సాగర్, ప్రజాపంథా కార్మిక సంఘం నేత సారా సురేష్, తదితరులు పాల్గొన్నారు.


