Thursday, May 8, 2025
Homeబీజినెస్'హక్-ఏఐ-థాన్’ ఆవిష్కరించిన ఎస్‌బీఐ లైఫ్

‘హక్-ఏఐ-థాన్’ ఆవిష్కరించిన ఎస్‌బీఐ లైఫ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: జీవిత బీమా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఏఐని వినియోగించేలా ప్రతిభావంతులను ప్రోత్సహించే దిశగా భారతదేశపు అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా ‘హక్-ఏఐ-థాన్’1వ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను, ప్రోడక్ట్ లభ్యతను మెరుగుపర్చడం, మోసాలను నివారించడంపై ప్రధాన దృష్టితో బీమా వ్యాపారంలో కీలక సవాళ్లకు పరిష్కారాలను సమిష్టిగా రూపొందించడానికి, భారతదేశవ్యాప్తంగా టెక్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఒక విశిష్టమైన వేదికగా ఉపయోగపడగలదు. ఎస్‌బీఐ లైఫ్ హ్యాక్-ఏఐ-థాన్ ప్రాంతీయ రౌండ్లలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా టెక్ విద్యార్థుల నుంచి 7,500 మంది రిజిస్ట్రేషన్లు వచ్చాయి. పుణె, ఢిల్లీ, చెన్నైలో ప్రాంతీయంగా నిర్వహించిన పోటీల్లో తమ వినూత్నమైన ఐడియాలను ఆవిష్కరించేందుకు, కఠినతరమైన ప్రక్రియ ద్వారా, దేశవ్యాప్తంగా 50 టీమ్‌లు ఎంపిక చేయబడ్డాయి. ముంబైలో నిర్వహించే గ్రాండ్ ఫినాలేలో తమ వినూత్న సొల్యూషన్స్‌ను ఆవిష్కరించేందుకు ఈ ప్రాంతీయ ఫైనలిస్టుల నుంచి టాప్ 15 టీమ్‌లు ఎంపిక చేయబడతాయి. ఒరిజినాలిటీ, సాధ్యాసాధ్యాలు, వాస్తవిక ప్రపంచంలో ఎంత వరకు ఉపయోగపడతాయనే అంశాల ప్రాతిపదికన జ్యూరీ ఈ వినూత్న సొల్యూషన్స్‌కి రేటింగ్ ఇస్తుంది.
సంప్రదాయ సరిహద్దుల పరిధులను దాటి వైవిధ్యంగా ఆలోచించే వారు సమిష్టిగా పని చేసినప్పుడు నూతన ఆవిష్కరణలు వస్తాయి. సైబర్‌సెక్యూరిటీ, పర్సనలైజేషన్, మోసాల నివారణ వంటి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించేందుకు యువ ప్రతిభావంతులను ఆహ్వానించడం ద్వారా, భవిష్యత్తులో బీమా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండే సొల్యూషన్స్‌ను కనుగొనేలా ఎస్‌బీఐ లైఫ్‌ యొక్క హ్యాక్-ఏఐ-థాన్ ప్రోత్సహిస్తుంది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమిష్టితత్వంతో, టెక్నాలజీ ఆధారిత విధానాలను అమలు చేయడంపై మాకున్న నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది” అని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆఫ్ బ్రాండ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ సీఎస్ఆర్) రవీంద్ర శర్మ తెలిపారు.

తమకు ప్రియమైన వారి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేలా ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనేది ఎస్‌బీఐ లైఫ్ ఉద్దేశం. డిజిటల్-ఫస్ట్ ప్రపంచంలో బీమాను మరింత సరళతరం చేయడం, మరింత అందుబాటులోకి తేవడం, సందర్భోచితంగా మార్చే ఆవిష్కరణలను రూపొందించేలా యువతకు సాధికారత కల్పించాలన్న ఈ విజన్‌కి ఎస్‌బీఐ లైఫ్ హ్యాక్-ఏఐ-థాన్ అనేది కొనసాగింపులాంటిదే. ఇందులో పాల్గొన్నవారి సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించడంలో వారికి గల ఆలోచనా విధానాలనేవి, భవిష్యత్ తరాలు అర్థవంతమైన మార్పు తేగలవన్న మా విశ్వాసాన్ని మరింత పటిష్టపర్చేవిగా ఉన్నాయి. జీవితాలకు బీమా కల్పించడమే కాదు, వారికి సాధికారత కూడా కల్పించాలన్న – అప్నే లియే, అప్నోం కే లియే – అనే మా హామీని నిలబెట్టుకునేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు.

తాజా దృక్పథాలు, సమిష్టిగా రూపొందించే సొల్యూషన్స్‌ను ఆహ్వానించడం ద్వారా, అంతిమంగా కస్టమర్లకు మరింత  మెరుగైన, సమ్మిళితమైన  బీమా అనుభూతిని కలిగించే దిశగా ముందుకు సాగుతున్న ఎస్‌బీఐ లైఫ్ డిజిటల్ పరివర్తన ప్రస్థానానికి తోడ్పడే ఐడియాలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -