Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఎస్బీఐ ఫలితాలు భళా

ఎస్బీఐ ఫలితాలు భళా

- Advertisement -

– క్యూ1లో రూ. 19,160 కోట్ల లాభాలు
– పెరిగిన నికర వడ్డీ ఆదాయం
న్యూఢిల్లీ : దేశంలోనే అతి పెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఆకర్షణీయ ఆర్థిక పలితాలను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2025- 26 జూన్‌ పీఏటీఏ ముగిసిన మొదటి త్రైమాసికం ( క్యూ1) మొండి బాకీలను కట్టడి లో ఉంచడం తో పాటు వడ్డీ ఆదాయం పెరగడం బ్యాంకు మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన మద్దతును ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గడిచిన త్రైమాసికం లో ఆ బ్యాంకు నికర లాభాలు 12.4 శాతం పెరిగి రూ. 19,160.44 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 17,035.16 కోట్ల లాబాలు ఆర్టించది. మార్కెట్‌ అంచనాలైన రూ. 17,095 కోట్లను అధిగమించింది.
గడిచిన క్యూ1 లో నికర వడ్డీ ఆదాయం 0.1 శాతం శాతం తగ్గి రూ. 41,072 కోట్లకు చేరింది. గత ఏడాది రూ. 41,126 కోట్లుగా ఉంది.
వడ్డీ ఆదాయం 5.8 శాతం పెరిగి రూ. 1,17,996 కోట్లకు చేరింది. గత ఏడాది రూ. 1,11,526 కోట్ల వడ్డీ ఆదాయం చోటు చేసుకుంది. గడిచిన క్యూ1 లో ఇతర ఆదాయం 55.4 శాతం గణనీయంగా పెరిగి రూ. 17,345 కోట్లకు చేరింది. గత ఏడాది ఇది రూ. 11,162 కోట్లుగా ఉంది. స్థూల నిరర్ధక ఆస్తుల 1.83 శాతంగా, నికర నిరర్ధకఆస్తులు 0.47 శాతంగా ఉన్నాయి. రుణాల జారీ 11.8 శాతం పెరిగి రూ. 41.91 లక్షల కోట్లకు, డిపాజిట్లు 8.7 శాతం పెరిగి రూ. 53.28 లక్షల కోట్లకు చేరాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img