నవతెలంగాణ-కంఠేశ్వర్: వార్షిక ప్రణాళిక 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగించారు. ఏప్రిల్ రెండో తేదీ వరకు పెంచారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఇలా త్రిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు https://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మార్చి 26, 2026 నుండి ఏప్రిల్ 02, 2026 తేది లోగ ధరఖాస్తు చేసుకొవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన ధరఖాస్తులను అర్జీదారుడు డౌన్ లోన్ చేసుకుని, ధరఖాస్తుకు అవసరమైన పత్రాలను జత చేసి సంబంధిత మండల కార్యాలయంలో అందజేయలన్నారు.
ఈ ప్రణాళిక ద్వారా బ్యాంక్ లోన్తో కూడిన యూనిట్స్, కనిష్ట యూనిట్ విలువ రూ.1 లక్ష నుండి గరిష్ట యూనిట్ విలువ రూ.25 లక్షల వరకు విలువ చేసే యూనిట్స్ (రవాణా రంగం, వ్యవసాయం సంబంధిత, పశు పోషణ) మరియు బ్యాంక్ లోన్ లేకుండా 100% సబ్సిడీతో కూడిన యూనిట్స్ (Minor Irrigation & Energization) మరియు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలకు 100% సబ్సిడి వర్తిస్తుందని వివరించారు.



