Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్దళిత రత్న అవార్డులను పంపిణీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 

దళిత రత్న అవార్డులను పంపిణీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 

- Advertisement -

– కామారెడ్డి వాసుకి దళిత రత్న అవార్డు

నవతెలంగాణ –  కామారెడ్డి

 రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం  దళిత రత్న అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరి  ప్రీతమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే దళితరత్న అవార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల దళిత నాయకులకు వారు చేసిన విశిష్ట సేవలను గుర్తించి దళితరత్న అవార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో  దళితుల పట్ల చేస్తున్న సేవ, అంకిత భావాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య కు దళితరత్న అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భం జీవితంలో మరువలేని చాలా సంతోషమైన జ్ఞాపకం అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి  ప్రీతమ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -