Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భయపెడుతున్న బీపీ, షుగర్.!

భయపెడుతున్న బీపీ, షుగర్.!

- Advertisement -

పెరుగుతున్న వ్యాధి పీడితులు
నవతెలంగాణ – మల్హర్ రావు

పూర్వకాలంలో వృద్ధాప్యం వచ్చాక రోగాలు చుట్టు ముట్టేవి.ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. వాతావరణం, ఆహారం, నీరు, ధ్వని, వాయు కాలుష్యాల కారణంగా ప్రజలు ఒత్తి డితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో 30 ఏళ్లు రాగానే మధుమేహం(షుగర్), అధిక రక్తపోటు (బీపీ) బారిన పడుతున్నారు.ఫాస్టుడ్, జంక్ఫుడ్తో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లో వంటలు పక్కనబెట్టి, రెడీమెడ్ ఫుడ్ వైపునకు జనాలు పరుగులు తీస్తున్నారు. దీంతో వ్యాధులు చుట్టుముడు తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వెంటాడుతు న్నాయి. వైద్యారోగ్యశాఖ ఇటీవల ఇంటింటి సర్వే చేపట్టగా షుగర్, బీపీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. చిన్న వయసులోనే ప్రజలు బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడటంపై వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి అవగాహన కలిగి ఉండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం 30 ఏళ్ల వయసు దాటిన షుగర్,బీపీతో బాధపడుతున్నట్లుగా తెలిపారు.

వ్యాయామంతో ఆరోగ్యం..

హెచ్బీఏ1సీ పరీక్ష చేయించుకుంటే మధుమేహం ( షుగర్) ఉందో లేదో తెలుస్తుంది. ఉదయాన్నే పరిగ డుపున ఏమీ తినకుండా, తాగకుండా తీసిన రక్తంలో షుగర్ 100లోపు ఉంటే వ్యాధి లేనట్లు, 100 నుంచి 126లోపు ఉంటే ప్రీడయాబెటిక్ దశలో ఉన్నట్లు. ఈ దశలో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి రాదు. 126 దాటితే వ్యాధి ఉన్నట్లు లెక్క. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే షుగర్ను కంట్రోల్లో ఉంచవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -