Monday, October 27, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ విడుదల

పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. ఈ క్రమంలోనే పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈనెల 29న జిల్లా స్థాయి, 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈనెల 28 నుంచి 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. సెప్టెంబర్‌ 2న ఓటర్ల తుది జాబితాను విడుదల ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -