- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ పండుగల వేళ రిషి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు స్కూలు బస్సులో హైదరాబాద్‌లోని జలవిహార్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టగా శంషాబాద్ సిగ్నల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయలైనట్లుగా సమాచారం. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
- Advertisement -



