నవతెలంగాణ – ఊరుకొండ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఊరుకొండ మండల పరిధిలోని ముచర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ వినితాధర్మేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని ముచర్లపల్లి గ్రామంలో పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచడం, విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాల ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ వినితా ధర్మేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని.. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండటం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆమె పేర్కొన్నారు. గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. భవిష్యత్తుల కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలస్వామి, హెడ్ మాస్టర్ శివలీల, వార్డు సభ్యులు స్వాతి, నితీష్, పాల్గొన్నారు. వారు అందరూ కలిసి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.



