Wednesday, February 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంస్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

స్కూల్లో కాల్పులు.. 10 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కెనడాలో కాల్పుల కలకలం రేపాయి. బ్రిటష్ కొలంబియాలో పాఠశాలలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఈ ఘటనకు కారణమైన నిందితుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టుంబ్లెర్‌ రిడ్జ్‌ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరు కూడా స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనతో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -