నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. మే 10న కాల్పుల విరమణ ప్రకటించాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జమ్మూలోని అన్ని సరిహద్దు జిల్లాలు, అలాగే కాశ్మీర్ డివిజన్లలోని పాఠశాలలు మరియు కళాశాలలను రేపటి నుంచి తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులకు తెగబడింది. ఈ దాడులతో పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను చవిచూసింది. భారీగా నష్టపోయింది. మొత్తానికి మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.
రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES