Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

నేడు ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లు సూచించారు. చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -