Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్నేడు పాఠశాలలు బంద్‌..

నేడు పాఠశాలలు బంద్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రయివేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు ఏపీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వెల్లడించాయి. ‘‘కొందరు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలను నిత్యం తనిఖీలు చేయడం, యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరం. ఆర్టీఈ ప్రవేశాల్లో తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేస్తున్నారు. పాఠశాలలను షోకాజ్‌ నోటీసులతో వేధించడం సహా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం లాంటి చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రంలో అన్ని ప్రయివేటు పాఠశాలలను ఒకరోజు మూసివేయాలని నిర్ణయించాం’’ అని ప్రయివేటు యాజమాన్యాలు పేర్కొన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad