నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రీల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి..యుద్ధానికి దారితీశాయి. మే7 ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై..భారత్ పైటర్ జెట్లు ముకుమ్మడి దాడి చేసి..100మందికి పైగా తీవ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పాక్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. జమ్ముకశ్మీర్ లోనీ ఎల్ఓసీ వెంబడి ఉన్న గ్రామాలపై పాక్ సేనలు బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ దాడులను భారత సేన తిప్పికొట్టిన పలు ప్రాంతాల్లో సామాన్య పౌరుల ఇండ్లు ధ్వంసంమైయ్యాయి. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్తాయికి చేరడంతో..ముందు జాగ్రత్తగా..దేశసరిహద్ద ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ముందస్తు సెలవులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా జమ్మూ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు స్కూలకు ఎమర్జీన్సీ సెలవులు ప్రకటించారు. రాజౌరి ప్రాంతంతో పాటు నియంత్రణ రేఖకు అతిసమీపంలో ఉన్న గ్రామాల్లో పలు బడులను తాత్కాలికంగా మూసివేశారు. నాలుగురోజుల దాడుల తర్వాత మే10 రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరం కుదరడంతో యుద్ధం ముగిసి..శాంతి నెలకొంది. ఆ తర్వాత జమ్మూలోని రాజౌరితోపాటు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను గురువారం పునర్ ప్రారంభించారు. దీంతో విద్యార్థులు సంతోషంగా తమ పాఠశాలలకు వెళ్తుతున్నారు.
రాజౌరిలో బడులు రీఓపెన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES