నవతెలంగాణ – రాయపోల్
విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపేది శాస్త్రీయత, శాస్ర్తీయ పరిజ్ఞానంతో ఆలోచించాలని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాంసాగర్, బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జీ. రాజ్ కుమార్ , ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సంజీవ్ అన్నారు.శనివారం రాయపోల్ మండలం రాంసాగర్, బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్త సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంసాగర్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ గార్డెన్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించారు. విజ్ఞానం జీవన వికాసానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బేగంపేట పాఠశాలలో ముగ్గుల పోటీలు, క్విజ్, వ్యాసరచన, ప్రసంగాలు, విద్యార్థుల స్కిట్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రమేష్ సార్ ప్రదర్శించిన ‘ప్లాస్టిక్ ప్రభావం’పై స్కిట్ ప్రజలపై ప్లాస్టిక్ దుష్ప్రభావాలను వివరించి అందరినీ ఆలోచింపజేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదయ్య, నవీన్ కుమార్, మహేష్, శ్యామ్ సుందర్, సుజాత, అనిఫ్, ఉమా, నవీన్ కుమార్, భాస్కర్, దివాకర్, నరేందర్ రెడ్డి, మంజుల, రాములు, నర్సింలు గౌడ్, ప్రభాకర్, వసంత, పావని, అమరేందర్, రాజేంద్ర, కమలాకర్, ప్రసాద్, రమేష్ సీఆర్పీలు యాదగిరి, స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపేది శాస్త్రీయత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



