Saturday, February 14, 2026
E-PAPER
HomeNewsఎక్స్‌అఫీషియో ఓటుపై ఎస్‌ఈసీ స్పష్టత

ఎక్స్‌అఫీషియో ఓటుపై ఎస్‌ఈసీ స్పష్టత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పలు చోట్ల హంగ్‌ ఏర్పడింది. దీంతో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్‌అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.

ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు ఎస్‌ఈసీ అవకాశం ఇచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -