- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 50% రిజర్వేషన్ పరిమితిని మించకుండా జీఓలు జారీ చేసినట్టు తెలపనుంది. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, అధికారులు–సిబ్బంది సమాయత్తంపై ఎన్నికల సంఘం కూడా కోర్టులో వివరణ ఇవ్వనుంది. కాగా, నిన్నటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాలను మండల కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు.
- Advertisement -


