- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. తెల్లవారుజామున అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు హెడ్ వర్క్స్ ఈఈ జి. శ్రీనివాసరావు వెల్లడించారు. సాయంత్రానికి బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -