Wednesday, January 14, 2026
E-PAPER
Homeఆటలుకేఎల్ రాహుల్ సెంచరీ..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

కేఎల్ రాహుల్ సెంచరీ..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (112*; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో అర్ధ శతకం చేశాడు. శ్రేయస్ అయ్యర్ (8) నిరాశపర్చగా.. రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), రవీంద్ర జడేజా (27), నితీశ్‌ రెడ్డి (20) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌక్స్, జేడెన్‌ లెనాక్స్‌, మైకేల్ బ్రాస్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -