Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంముమ్మ‌రంగా రెండో విడ‌త ‘స‌ర్’.. 99శాతం గ‌ణ‌న‌ ఫారాల పంపిణీ

ముమ్మ‌రంగా రెండో విడ‌త ‘స‌ర్’.. 99శాతం గ‌ణ‌న‌ ఫారాల పంపిణీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రెండో ద‌శ‌లో భాగంగా 12 రాష్ట్ర‌, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ప్ర‌త్యేక స‌మ‌గ్ర ఓట‌ర్ జాబిత(స‌ర్) ప్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. రెండో ద‌ఫాలో 50.40 కోట్లకు పైగా ఓటర్లు, 99శాతం గ‌ణ‌న‌ (enumeration forms) ఫారాల‌ను పంపిణీ చేశామ‌ని, కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఈ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్ల‌డించింది. SIR రెండో విడ‌త‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వ‌హిస్తామ‌ని గ‌తంలో ఈసీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

గోవాలో 11,85,016 మంది ఓటర్లు, లక్షద్వీప్‌లో 57,813 మంది ఓటర్లు గణన ఫారాలను అందుకున్నార‌ని, ఈ ప్రాంతాల్లో స‌ర్వే 100 శాతం విజ‌య‌వంత‌మైంద‌ని తెలిపింది. అదే విధంగా అండమాన్ నికోబార్‌లో పంపిణీ ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంద‌ని, 99.98 శాతం ఫారాలు పంపిణీ చేయ‌బ‌డింద‌ని తెలిపింది.

SIR రెండో విడ‌త‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 15.37 కోట్ల ఫారాలు పంపిణీ చేశామ‌ని ఈసీ పేర్కొంది. మొత్తం ఓటర్లలో, 10,28 కంటే ఎక్కువ గణన ఫారాలు ఈ SIR రెండవ దశలో డిజిటలైజ్ చేయబడ్డాయ‌ని తాజాగా ప్రెస్ నోట్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -