Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅద్దె ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరా

అద్దె ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హాస్టళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో మాత్రమే ర‌హ‌స్య కెమెరాలు అమ‌ర్చి సంఘ‌ట‌న‌లు అనేక చూశాం.కాగా ఇప్పుడు ఏకంగా అద్దె ఇళ్లలోని బాత్రూంలు, బెడ్‌రూంలలో కూడా ఇలాంటివి జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఓ ఇంటి యజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నగరంలోని మధురానగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి బాత్రూంలో అమర్చిన బల్బులో రహస్య కెమెరా ఉండటాన్ని గుర్తించి నివ్వెరపోయాడు.

వివరాల్లోకి వెళితే, మధురానగర్‌లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అద్దెకు ఉంటున్న వ్యక్తికి బాత్రూంలోని బల్బుపై అనుమానం వచ్చింది. దాన్ని పరిశీలించగా, అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన సీక్రెట్ కెమెరా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -