•ఎంపీడీఓ బద్రి శైలజ రాణి
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో బుధవారం పంచాయతీ సెక్రటరీ లతో మండల ఎంపీడీవో బద్రి శైలజా రాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా మండలం లోని ఏ గ్రామ పంచాయతీ లోనైనా లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా, ఇళ్లలోకి నీరు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాల్లోకి చేర్చడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇసుక, మొరం సరఫరా, ఒక్కో ఇటుక రూ.5.50 ల కే ఇప్పించేలా చూడాలని తెలుపడం జరిగింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డు దరఖాస్తు లను వెంటనే ఇవ్వాలని సూచించడం జరిగింది. ఈ సమావేశం లో ఎంపీడీఓ బద్రి శైలజా రాణి, తహసీల్దార్ పి.సుమన్, ఎంపీఓ దేవరకొండ ఉమేష్ లు పాల్గొన్నారు.