Sunday, May 11, 2025
Homeరాష్ట్రీయంభద్రతా చర్యలు కట్టుదిట్టం

భద్రతా చర్యలు కట్టుదిట్టం

- Advertisement -

ఆర్మీ కార్యకలాపాలపై ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయొద్దు
అమల్లోకి సిటీ పోలీస్‌ యాక్ట్‌
డ్రోన్స్‌, టపాసులపై నిషేధం
హైదరాబాద్‌ నగర సీపీ, డీజీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

దేశంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొ న్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో పోలీస్‌ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రాలను కేంద్ర హౌంశాఖ అప్రమత్తం చేసిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో నగర డీజీ సీసీ సీవీ ఆనంద్‌ కీలక నిర్ణయాలు వెల్లడించారు. సౌత్‌ జోన్‌, సౌత్‌ వెస్ట్‌, సౌత్‌ ఈస్ట్‌ జోన్లతోపాటు నగర పోలీస్‌ కమిష నరేట్‌ అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో ముందస్తు జాగ్ర త్త చర్యలు తీసుకున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరిం చారు. పలు ప్రాంతాలల్లో ఆర్‌ఏఎఫ్‌ జవాన్లు, పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. సెక్షన్‌ 67(సి) కింద తన అధికారాలను ఉపయోగించి హైదరాబా ద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులోకి తీసుకొచ్చారు. ప్రజల భద్రత కోసం మిలటరీ కంటోన్మెంట్‌ ప్రాంతాలతో పా టు చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల్లో టపాసులు లే దా బాణసంచా పేల్చడం పై నిషేధం విధించారు. శం షాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ల ఎగరవేత పై నిషేధం విధించారు. ప్రస్తుత భద్రతా వాతావరణం దృష్ట్యా, టపాసులు కాల్చినా పేలుడు లేదా తీవ్ర వాద సంబంధిత కార్యకలాపాలని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పేలు డు శబ్దాల తో భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి ని కలిగే అవకాశం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నట్టు సీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, కార్యక్రమాల్లో టపాసులు పేల్చడం నిషేధమన్నారు. డ్రోన్స్‌ సైతం ఎగురవేయొ ద్దన్నారు. ఆర్మీఫోర్సు మూమెంట్స్‌, కార్యకలాపాలపై సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫొటోలతోపాటు తప్పుడు వార్తలు షేర్‌ చేయొద్దని హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగు తాయని సీపీ స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానా స్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనిస్తే వారి కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -