నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్‌కతాలోని ‘ది నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి’ బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కోల్‌కతా నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి కొద్ది నిమిషాల్లోనే ఆ విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. అప్రమత్తమైన అధికారులు వెంటనే అందులోని ప్రయాణికులు, లగేజీని కిందికి దింపేశారు. విమానాన్ని ‘ఐసోలేషన్ బే’లోకి తీసుకెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.