నవతెలంగాణ-హైదరాబాద్ : మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని, మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలు ఇష్టపడతారని మంత్రి సీతక్క అన్నారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు పేరుతో జరుగుతున్న యూత్ మీటింగ్స్ కు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కల్యాణం అవుతుందన్నారు. మతాలు వేరైనా, దేవుళ్లు వేరైనా ఎవరి విశ్వాసాలు వారివని ఎవరి విశ్వాసాలను వారు నమ్ముతూ సాటి మనిషిని ప్రేమించాలని ఆమె అన్నారు. మనదేశం లౌకిక రాజ్యాంగంగా పెద్దలు నిర్మించారని, ఇక్కడ అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంటుందన్నారు. మత సంస్థలు మత ప్రచారానికే పరిమితం కాకుండా ప్రజల సౌఖ్యం, ఆరోగ్యం కోసం పాటు పడాలని మనం చేసే సేవ వెయ్యేండ్లు ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఆమె సూచించారు. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ మాట్లాడుతూ తెలంగాణ, ఏపీలో సంఘాలతో కేవలం యేసు క్రీస్తు సువార్తనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేదలకు అన్నదానం,వితంతువులకు కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ, అనాథ పిల్లలకు ఉచిత విద్య, యువతులకు వివాహలు జరిపిస్తామన్నారు. చెడు అలవాట్లకు బానిసైన యువతకు కౌన్సిలింగ్ నిర్వహించి సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామన్నారు.ఈనెల 17వ తేదీ వరకు ఈ సదస్సులు జరుగుతాయని చెప్పారు.
పీస్ అంబాసిడర్ అవార్డు
దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న బిషప్ డాక్టర్ థామస్ కు అమెరికా యూనివర్శిటీ అందించిన సీప్ అంబాసిడర్ అవార్డును మంత్రి సీతక్క ఆయనకు బహూకరించారు.ఈ కార్యక్రమంలో షీబా థామస్,మోజస్,డేవిడ్, జీవన్ డిస్ను,అశోక్,జాయ్ తదితరులు పాల్గొన్నారు.
మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దు: మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES