Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంసెగార్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాలి: ఉన్నావో బాధితురాలి త‌ల్లి

సెగార్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాలి: ఉన్నావో బాధితురాలి త‌ల్లి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సుప్రీంకోర్టుకు ఉన్నావో బాధితురాలి త‌ల్లి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. కోర్టు నిర్ణ‌యంతో త‌న‌కు ఆనందంగా ఉంద‌ని, త‌న‌ కూతురికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ మీడియా స‌మావేశంలో ఆమె డిమాండ్ చేసింది. ఉన్నావో లైంగిక‌దాడి కేసులో ప్ర‌ధాన నిందితుడైన బీజేపీ కుల్దీప్ సింగ్ సెగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. బెయిల్ తోపాటు జీవిత ఖైదు శిక్ష‌ను ర‌ద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణ‌యాన్ని బాధితులు సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. సోమ‌వారం బాధితురాలి పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు..ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేసింది. సెగార్‌కు జారీ చేసిన బెయిల్ ను ర‌ద్దు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -