నవతెలంగాణ – పెద్దవంగర: క్రీడా పాఠశాలల్లో 4 వ తరగతి ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ పాఠశాలల్లో 4 వ తరగతి ప్రవేశాల కోసం ఈనెల 19 న మండల స్థాయి ఎంపిక క్రీడా పోటీలను మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ లోని క్రీడా పాఠశాలల్లో చేరేందుకు 2016 సెప్టెంబర్ ఒకటి నుండి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, మూడవ తరగతి ప్రోగ్రెస్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫాం తీసుకురావాలని, స్కిల్ టెస్ట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు tgss.telangana.gov.in లో నమోదు చేసుకోవాలి పేర్కొన్నారు.
క్రీడ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES