Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుCPI సీనియ‌ర్ నేత‌ దొడ్డ నారాయణ రావు ఇక‌లేరు

CPI సీనియ‌ర్ నేత‌ దొడ్డ నారాయణ రావు ఇక‌లేరు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: సీపీఐ కురువృద్ధుడు, స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణ రావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నారాయణ రావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ సీనియర్‌ నేతలు నారాయణ తో పాటు పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి దన్నుగా నిలిచి.. నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస విడిచే వరకు నిలబడిన మహోన్నత వ్యక్తి దొడ్డ నారాయణరావు అని కొనియాడారు. సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయనరు. అదేవిధంగా 1940వ దశకంలో నిజాం ప్రభువు నియంత పాలనకు వ్యతిరేకంగా దొడ్డ నారాయణ పోరాడారని పలువురు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, గతేడాది ఆగస్టు 20న ఆయన సతీమణి సక్కుబాయి (85) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -