Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) సీనియర్‌ నేత రఘుపాల్‌ పరిస్థితి విషమం

సీపీఐ(ఎం) సీనియర్‌ నేత రఘుపాల్‌ పరిస్థితి విషమం

- Advertisement -

– ఆస్పత్రిలో పరామర్శించిన బీవీ రాఘవులు, డీజీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, హైదరాబాద్‌ నగర మాజీ కార్యదర్శి జి.రఘుపాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన్ను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, పార్టీ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డీజీ.నరసింహారావు, నగర మాజీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు బి.గోపి, జోగు ప్రకాష్‌, సుంచు విజేందర్‌, తదితరులు పరామర్శించారు. రఘుపాల్‌లో మనోధైర్యాన్ని కల్పించేందుకు బీవీ.రాఘవులు ప్రయత్నించారు. పాత జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. రఘుపాల్‌ భార్య భారతి, కుమారుడు డాక్టర్‌ గోపాల్‌రెడ్డి, కోడలు డాక్టర్‌ విజయలక్ష్మి, అల్లుడు ఎం.శ్రీనివాస్‌, కూతురు తిరుమలకు కూడా ఆయన మనోధైర్యాన్ని కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -