Tuesday, December 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సంచలన వ్యాఖ్యలు

సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: స్వల్పకాలిక, సుదీర్ఘ యుద్ధాలకూ భారత్ సిద్ధం ఉండాలని సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఐఐటీ బాంబేలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘మన ఇద్దరు ప్రత్యర్థులు అణుసామర్థ్యం కలిగి ఉన్నారు. వాటి నుంచి వచ్చే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే కొనసాగుతోన్న సరిహద్దు వివాదాల కారణంగా భూతల ఘర్షణల్లో పోరాడేందుకు సంసిద్ధంగా ఉండాలి. అయితే వీటిని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్ సోనిక్స్, రోబోటిక్స్, ఎడ్జ్‌ కంప్యూటింగ్ పోరాట తీరును మారుస్తున్నాయి’’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -